భారత మహిళా క్రీడాకారులకు ధన్యవాదాలు తెలిపిన మోదీ...

భారత మహిళా క్రీడాకారులకు ధన్యవాదాలు తెలిపిన మోదీ...

రక్షా బంధన్ సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీకి భారత మహిళా క్రీడాకారులు కొందరు ట్విట్టర్‌లో శుభాకాంక్షలు తెలిపారు. అయితే మోదీ తనకు శుభాకాంక్షలు తెలిపిన వారిలో  ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. ఇక పీఎం కు రక్షా బంధన్ విషెస్ చెప్తూ బ్యాడ్మింటన్ పివి సింధు ఓ వీడియో సందేశాన్ని పోస్ట్ చేసారు. అందులో... '' హ్యాపీ రక్షా బంధన్ సర్. మీరు దేశం కోసం చాలా చేసారు. ప్రస్తుతం ఉన్న కరోనా వైరస్ కారణంగా మేము ఒలంపిక్స్ ఆడలేదు. కానీ వచ్చే ఏడాది ఇదే సమయానికి మీకు బహుమతిగా చాలా మెడల్స్ ఇస్తాము'' అని తెలిపింది. ఇక ఆమెకు కృతజ్ఞతలు తెలుపుతూ "మీరు ఇప్పటికే దేశానికి చాలా బహుమతులు ఇచ్చారు మరియు రాబోయే కాలంలో మీరు రాణించగలరని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. ప్రతి భారతీయుడు మీ గురించి గర్వపడుతున్నాడు!" అని తెలిపారు. మోదీకి రక్షా బంధన్ శుభాకాంక్షలు తెలిపిన వారిలో బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్,  బాక్సర్ మేరీ కోమ్, స్ప్రింటర్ డ్యూటీ చంద్, హిమాదాస్ ఉన్నారు.