ప్రధాని మోదీ అయోధ్య పర్యటనకు షెడ్యూల్ ఫిక్స్.!

ప్రధాని మోదీ అయోధ్య పర్యటనకు షెడ్యూల్ ఫిక్స్.!

అయోధ్యలో రామ మందిర నిర్మాణము కోసమై యావత్ భారత దేశం కొన్నేళ్ల నుండి ఎదురుచూస్తుంది. కాగా మందిర నిర్మాణానికి వచ్చిన అనుమతితో ఎప్పుడు పునాదిరాయి పడుతుందా అని హిందువులంతా ఎదురు చూస్తున్నారు. ఇక ఎట్టకేలకు ఆ కార్యక్రమానికి హాజరవ్వడానికి ప్రధాని మోడీ షెడ్యూల్ ఖరారయ్యింది. ఈ మేరకు ఆగస్ట్‌ 5న ఉదయం జరిగే భూమి పూజ కార్యక్రమంలో మోదీ పాల్గొంటారని సోమవారం ప్రధానమంత్రి కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ఇక పునాదిరాయి కార్యక్రమానికి హాజరవ్వాలని శ్రీరామ‌జ‌న్మ‌భూమి తీర్థ క్షేత్ర ట్ర‌స్టు చైర్మన్‌ మోదీకి ఆహ్వానం పంపిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ తో పాటు 250 మంది అతిథులు హాజరుకానున్నారు. హాజరయ్యేవారిలో కేంద్రమంత్రులు, మందిర నిర్మాణం కోసం పోరాడిన పలు హిందూ సంఘాలు హాజరు కానున్నాయి.