భారత్ బయోటెక్‌కు ప్రధాని మోడీ అభినందనలు..

భారత్ బయోటెక్‌కు ప్రధాని మోడీ అభినందనలు..

హైదరాబాద్‌లో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన ముగిసింది... తన పర్యటనలో భారత్ బయోటెక్‌కు వెళ్లిన మోడీ.. కరోనా కట్టడికోసం దేశీయంగా తయారవుతోన్న 'కోవాగ్జిన్‌' పురోగతిపై బయోటెక్ శాస్త్రవేత్తలతో చర్చించారు.. ఈ సందర్భంగా వ్యాక్సిన్ ట్రయల్స్‌ పురోగతిపై మోడీకి వివరించారు బయోటెక్ సైంటిస్టులు.. ఆ తర్వాత హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్ శాస్త్రవేత్తలను సోషల్ మీడియా వేదికగా అభినందించారు ప్రధాని మోడీ... ఈ సంస్థ కోవిడ్-19 వ్యాక్సిన్ తయారీని వేగవంతం చేసేందుకు ఐసీఎంఆర్‌తో కలిసి పని చేస్తోందన్నారు. కోవిడ్-19 నిరోధానికి స్వదేశీ వ్యాక్సిన్ తయారీలో సాధించిన పురోగతిని శాస్త్రవేత్తలు తనకు వివరించారని తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ వ్యాక్సిన్ ట్రయల్స్‌లో ఇప్పటి వరకు సాధించిన ప్రగతి పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు ట్విట్టర్‌లో పేర్కొన్నారు ప్రధాని. ఇక, హైదరాబాద్‌లో తన పర్యటన ముగించుకుని... హకీంపేట నుంచి పుణె బయల్దేరి వెళ్లారు ప్రధాని నరేంద్ర మోడీ.