కరోనాపై ప్రధాని సమీక్ష... కీలక సూచనలు

కరోనాపై ప్రధాని సమీక్ష... కీలక సూచనలు

కరోనా వైరస్‌ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు ప్రధాని నరేంద్ర మోడీ... చిన్నచిన్న జాగ్రత్తలను తీసుకోవడం ద్వారా కరోనాను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు అని ట్వీట్ చేశారు. కోవిడ్ 19పై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన మోడీ... ఆరోగ్యశాఖ నుంచి వివరాలు తెలుసుకున్నారు. కరోనాను కంట్రోల్ చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తున్నాయని ట్వీట్ చేశారు ప్రధాని నరేంద్ర మోడీ... వివిధ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఎయిర్‌పోర్ట్‌లోనే ప్రాథమిక పరీక్షలు నిర్వహిస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. చేతులు శుభ్రంగా కడుకోవాలని, అనుమానితులకు దూరంగా ఉండాలని, కళ్లు, ముక్కు, నోటిని చేతులతో తాకడం తగ్గించాలంటూ కొన్ని సూచనలు చేశారు ప్రధాని మోడీ.