క‌రోనా వారియ‌ర్స్‌ని మ‌ర‌వొద్దు.. వారికి అభినంద‌న‌లు-ప్ర‌ధాని

క‌రోనా వారియ‌ర్స్‌ని మ‌ర‌వొద్దు.. వారికి అభినంద‌న‌లు-ప్ర‌ధాని

ఢిల్లీలో ఎర్ర‌కోట వేదిక‌గా 74వ స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా జ‌రిగాయి.. క‌రోనా కార‌ణంగా ప‌రిమిత సంఖ్య‌లో అతిథుల‌ను ఆహ్వానించారు.. అతిథులల్లో ఐదవ వంతు మాత్రమే వేడుకలకు హాజరయ్యారు. కేవలం 150 మంది వీఐపీలకు మాత్రమే ఆహ్వానం అందింది. ఇక‌, ఎర్రకోటపై జాతీయజెండాను  ఆవిష్క‌రించిన ప్రధాని నరేంద్ర మోదీ... త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం జాతినుద్దేశించి ప్ర‌సంగించిన ఆయ‌న‌.. ఈ సందర్భంగా కరోనా యోధులకు కృతజ్ఞతలు తెలిపారు. నా తోటి భారతీయుల సామర్థ్యం, విశ్వాసంపై నాకు నమ్మకం ఉంద‌న్న ప్ర‌ధాని మోడీ... మేం ఏదైనా చేయాలని నిర్ణయించుకున్న తర్వాత ఆ లక్ష్యాన్ని సాధించే వరకు విశ్రాంతి తీసుకోబోమ‌న్నారు. కలను భారత్ సాకారం చేస్తుందని నాకు నమ్మకముంద‌న్న మోడీ.. కరోనా మహమ్మారి కారణంగా ప్రత్యేక పరిస్థితిని ఎదుర్కొంటున్నందున కరోనా యోధులను అభినందించడం మర్చిపోకూడ‌ద‌న్నారు.