రేపు వారణాసిలో మోడీ పర్యటన

రేపు వారణాసిలో మోడీ పర్యటన

ప్రధాని నరేంద్ర మోడీ.. రేపు ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో పర్యటించనున్నారు. హండియా- రాజతలాబ్‌ మధ్య పూర్తయిన ఆరులేన్ల జాతీయ రహదారిని జాతికి అంకితం చేయనున్నారు. అనంతరం దేవ్‌ దీపావళి వేడుకల్లో పాల్గొనున్నారు ప్రధాని మోడీ.. కాశీ విశ్వనాథ్‌ టెంపుల్‌ కారిడార్‌ ప్రాంతంతోపాటు సారనాథ్‌ పురావస్తుశాఖ మ్యూజియంను సందర్శించనున్నారు. కాగా, కరోనా వ్యాక్సిన్‌ విషయంపై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఇప్పటికే చర్చించిన ప్రధాని... తాజాగా.. ఒకే రోజు మూడు ప్రాంతాల్లో పర్యటించి.. కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్, వ్యాక్సిన్‌కు సంబంధించిన అంశాలపై సంబంధిత సైంటిస్టులతో చర్చలు జరపడం.. వ్యాక్సిన్‌ పురోగతిపై ఆరా తీసిన సంగతి తెలిసిందే.