సీఎంల‌తో ప్రధాని వీడియో కాన్ఫరెెన్స్.. తెలుగు రాష్ట్రాల సీఎంలు ఏం చెబుతారో..?

సీఎంల‌తో ప్రధాని వీడియో కాన్ఫరెెన్స్.. తెలుగు రాష్ట్రాల సీఎంలు ఏం చెబుతారో..?

రోసారి ముఖ్య‌మంత్రుల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్‌కు సిద్ధ‌మ‌య్యారు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ... భారత్‌లో కరోనా కేసులు రోజురోజకు పెరిగిపోతున్న స‌మ‌యంలో నిర్వ‌హిస్తోన్న ఈ స‌మావేశానికి ప్రాధాన్య‌త ఏర్ప‌డింది.. ఇవాళ 10 రాష్ట్రాల‌కు చెందిన సీఎంల‌తో చ‌ర్చ‌లు జ‌ర‌ప‌నున్నారు ప్ర‌ధాని.. ఈ స‌మావేశంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ సీఎంల‌తో పాటు.. కర్ణాట‌క, తమిళనాడు, మహారాష్ట్ర, బీహార్, గుజరాత్, పంజాబ్, ఉత్తర్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు పాల్గొన‌నున్నారు. పెరుగుతున్న కరోనా కేసుల ప్రభావం, కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలు సహా పలు అంశాలపై ప్ర‌ధాని మోడీ, ముఖ్యమంత్రులతో చర్చించనున్నారు.

 అయితే, తెలుగు రాష్ట్రాల సీఎంలు ఏం చెప్ప‌బోతున్నారు అనేది ఆస‌క్తిగా మారింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వ‌రుస‌గా క‌రోనా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి.. మ‌రోవైపు మృతుల సంఖ్య కూడా ఆందోళ‌న‌క‌స్థాయిలో ఉంది.. ఇక‌, తెలంగాణ‌లో ఓరోజు త‌గ్గిన‌ట్టు అనిపించినా.. మ‌రోరోజు భారీ స్థాయిలో కేసులు న‌మోదు అవుతున్నాయి.. ఈ నేప‌థ్యంలో ఏపీ, తెలంగాణ సీఎంలు ఏం చెప్ప‌బోతున్నారు. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఎలాంటి సూచ‌న‌లు చేయ‌నున్నారు అనేది ఆస‌క్తిగా మారింది. ఈ స‌మావేశంలో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీతో పాటు.. రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, వైద్యశాఖ మంత్రి హర్షవర్దన్‌, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి తదితరులు పాల్గొన‌నున్నారు.