మోడీ చివరి కేబినెట్ నిర్ణయాలపై ఉత్కంఠ..!

మోడీ చివరి కేబినెట్ నిర్ణయాలపై ఉత్కంఠ..!

ఎన్నికల షెడ్యూల్ ప్రకటించేందుకు ఓ వైపు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమైంది.. ఏ క్షణంలోనైనా షెడ్యూల్ వెలువడే అవకాశం ఉంది. మరి షెడ్యూల్ రాకముందే.. కొత్త పథకాలు, తాయిలాలతో ప్రజలను ఆకట్టుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోడీ నేతృత్వంలో ఇవాళ భేటీకానున్న కేంద్ర కేబినెట్‌ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనే ఉత్కంఠ నెలకొంది. ఇక ప్రధాని నరేంద్ర మోఢీ ఈ నెల 9వ తేదీన ఉత్తరప్రదేశ్, బిహార్‌లలో పలు శంకుస్థాపనల్లో పాల్గొంటారని, ఆ సందర్భంగా తన కేబినెట్‌ భేటీలో తీసుకున్న నిర్ణయాలను ఘనంగా ప్రకటిస్తారని ప్రచారం కూడా సాగుతోంది. ఈ నెల 8వ తేదీ నుంచి 10వ తేదీలోపు ఎప్పుడైనా సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదకావొచ్చు అనే ప్రచారం జరుగుతున్న సమయంలో... ప్రధాని నరేండ్ర మోడీ నిర్వహిస్తున్న తన చివరి కేబినెట్ సమావేశంపైనే అందరు దృష్టి సారించారు.