ఐరాస ముందు అతిపెద్ద సవాల్... సమూల ప్రక్షాళన జరగాలి... 

ఐరాస ముందు అతిపెద్ద సవాల్... సమూల ప్రక్షాళన జరగాలి... 

ఐక్యరాజ్య సమితి ఏర్పడి 75 సంవత్సరాలైంది.  ఈ సందర్భంగా 75 వ వార్షికోత్సవాలను భారీ ఎత్తున నిర్వహించాలని అనుకున్నారు.  కానీ, కరోనా మహమ్మారి కారణంగా ఈ ఏడాది సర్వసభ్య సమావేశాలను వర్చువల్ గా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఈరోజు ప్రధాని మోడీ ప్రసంగించారు.  ఐరాసలో సంస్కరణలు తీసుకురావాలని, భారత్ కు ఐరాసలో  ప్రాధాన్యత కల్పించాలని ప్రధాని కోరారు. ప్రస్తుతం భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయని, ప్రపంచం సరికొత్త సవాళ్ళను ఎదుర్కొంటోందని, ప్రపంచం యావత్తు కరోనాతో పోరాటం చేస్తోందని ప్రధాని మోడీ పేర్కొన్నారు.  ఐరాస ముందు అతిపెద్ద సవాల్ ఉందని, కరోనా పోరాటంలో ఐరాస కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు.  1945 లో ఐరాస ఏర్పడినపుడు ఉన్న పరిస్థితులు ఏంటి, ఇప్పుడున్న పరిస్థితులు ఏంటి అన్నది ఐరాస ఆలోచించాలని,  సమూల ప్రక్షాళన చేసి సంస్కరణలు   తీసుకురావలసిన  అవసరం ఉందని ప్రధాని మోడీ ఈ సందర్భంగా పేర్కొన్నారు.