హనుమాన్‌గఢీలో  పీఎం మోడీ ప్రత్యేక పూజలు

హనుమాన్‌గఢీలో  పీఎం మోడీ ప్రత్యేక పూజలు

ప్రధాని నరేంద్ర మోడీ అయోధ్యకు చేరుకున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో లక్నో చేరుకున్న ప్రధాని అక్కడి నుంచి వాయుసేన హెలికాప్టర్‌లో అయోధ్యకు విచ్చేశారు. అయోధ్య చేరుకున్న ఆయనకు కోవిడ్‌ ప్రొటోకాల్‌ ప్రకారం యూపీ సీఎం యోగి‌, ఉన్నత అధికారులు  స్వాగతం పలికారు. అక్కడి నుంచి సీఎం యోగితో కలిసి హనుమన్‌ గడీ ఆలయానికి ఆయన వెళ్లారు. ఆలయంలో స్వామి వారిని దర్శించుకున్నారు. స్వామి వారికి హారతి ఇచ్చారు. అనంతరం ఆలయంలో ప్రదక్షిణలు చేశారు. అనంతరం అక్కడి నుంచి ఆయన రామజన్మభూమికి తరలివెళ్లారు. మధ్యాహ్నం 12:30 నుంచి 12:40 వరకు భూమిపూజ జరుగనుంది. మధ్యాహ్నం 12:45 గంటలకు ప్రధాని మోడీ ప్రసంగించనున్నారు.