కష్టపడుతున్న వారంతా చౌకీదార్లే: మోడీ

కష్టపడుతున్న వారంతా చౌకీదార్లే: మోడీ

అభివృద్ధి, అవినీతిరహిత భారతదేశం కోసం ఎల్లవేళలా శ్రమిస్తున్న ప్రతిఒక్కరూ కాపలాదారులేనని ప్రధానమంత్రి నరేంద్రమోడీ వ్యాఖ్యానించారు. సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో 'మైబీ చౌకీదార్' అంటూ కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ప్రచారానికి తెరతీశారు. ఈ సందర్భంగా ట్విటర్‌ వేదికగా కార్యకర్తలనుద్దేశించి ఓ సందేశమిచ్చారు. 

‘మీ చౌకీదార్‌ ఇక్కడ నిలబడి దేశం కోసం సేవ చేస్తున్నారు. కానీ నేను ఒంటరి కాదు. అవినీతి, సామాజిక రుగ్మతలు, అపరిశుభ్రతపై పోరాటం చేస్తున్న ప్రతి ఒక్కరూ చౌకీదారే. దేశ అభివృద్ధి కోసం కష్టపడుతున్న వారంతా చౌకీదార్లే' అని మోడీ ట్వీట్‌ చేశారు. దీంతో పాటు ఓ వీడియోను కూడా పోస్టు చేశారు.