లైవ్‌: అతి పెద్ద కోవిడ్‌ వ్యాక్సినేషన్‌..

లైవ్‌: అతి పెద్ద కోవిడ్‌ వ్యాక్సినేషన్‌..

సామాన్యుల నుంచి వీవీఐపీల వరకు అందరి వెన్నులో వణుకుపుట్టింది కరోనా వైరస్.. కోట్లాది మంది ఉపాధిని దెబ్బకొట్టింది, లక్షలాది మంది ఉద్యోగాలు ఊడగొట్టింది.. అంతెందుకు దేశాల ఆర్థిక వ్యవస్థపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపుతూనే ఉంది. అయితే, కోవిడ్‌కు చెక్ పెట్టేందుకు సిద్ధమైంది భారత ప్రభుత్వం.. ప్రపంచంలోనే అతిపెద్ద కోవిడ్ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ శ్రీకారం చుట్టింది.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాక్సిన్ ప్రక్రియను అధికారికంగా ప్రారంభించారు ప్రధాని నరేంద్ర మోడీ.. దేశ వ్యాప్తంగా మొత్తం 3,006 కేంద్రాలలో టీకాలు వేస్తున్నారు.. ఈ కార్యక్రమం అమలయ్యేకొద్దీ, టీకాలు వేసే కేంద్రాల సంఖ్య 5 వేలకు పైగానే పెరిగే అవకాశం ఉంది.. ఇక, వ్యాక్సినేషన్‌ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ఏం మాట్లాడుతున్నారో తెలుసుకోవడానికి కింది వీడియో లింక్‌ను క్లిక్‌ చేయండి...