ఫిట్ ఇండియా వార్షికోత్సవం సందర్భంగా కోహ్లీతో మాట్లాడిన మోదీ...

ఫిట్ ఇండియా వార్షికోత్సవం సందర్భంగా కోహ్లీతో మాట్లాడిన మోదీ...

భారత ప్రధాని నరేంద్ర మోడీ గత ఏడాది జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని.. ఫిట్ ఇండియా ఉద్యమానికి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అప్పుడు జాతీయ క్రీడా దినోత్సవమైన ఆగస్టు 29వ తేదీ.. హాకీ లెజెండ్ ధ్యాన్‌చంద్ పుట్టిన రోజును వేదికగా చేసుకుని మోడీ ఈ ఉద్యమాన్ని ప్రారంభించారు. ఒక క్రీడాకారులే కాకుండా.. ఇతర రంగాల్లోని ఉద్యోగులు, విద్యార్థులు, ప్రజలు అంతా ఆరోగ్యంగా ఫిట్‌గా ఉండాలని ఈ ఉద్యమానికి తెరలేపారు. అయితే ఈ ఫిట్ ఇండియా ఉద్యమం ప్రారంభమై ఒక ఏడాది పూర్తయిన సందర్బంగా మోదీ ఈ రోజు ఫిట్నెస్ పై ప్రజలకు అవగాహనా కల్పిస్తున్న వారితో అలాగే మరికొంత మందితో లైవ్ లో మాట్లాడారు. అందులో భాగంగానే భారత కెప్టెన్ విరాట్ కోహ్లీతో కూడా మోడీ ఇంటరాక్ట్ అయ్యారు. అందులో తన యొక్క ఫిట్నెస్ గురించి మోడీ కోహ్లీని ప్రశ్నించగా ఆసక్తికరమైన సమాధానాలు ఇచ్చాడు ఈ నెంబర్ వన్ క్రికెటర్. అయితే కోహ్లీ మోదీకి ఏం సమాధానాలు ఇచ్చాడో తెలియాలంటే ఈ కింది వీడియోను క్లిక్ చేయండి.