యువత సవాళ్లను అధిగమిస్తుంది: మోడీ 

యువత సవాళ్లను అధిగమిస్తుంది: మోడీ 

స్మార్ట్ ఇండియా హ్యాకథన్-2020 ముగింపు కార్యక్రమంలో ప్రధాన మంత్రి మోడి కీలక ప్రసంగం చేశారు. గత శతాబ్దాలలో, మన దేశం ఉత్తమ శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు, సాంకేతిక వ్యవస్థాపకులను ప్రపంచ మానవాళికి అందించిందని ఎప్పుడూ గర్వపడుతుంటామని ఆయన అన్నారు. ఇది 21 వ శతాబ్దం, వేగంగా మారుతున్న ప్రపంచంలో, భారతదేశం తన ప్రభావవంతమైన పాత్రను పోషించడానికి మరింత మారాలని ఆయన అన్నారు. ఈ ఆలోచనతో, దేశంలో ఆవిష్కరణ, పరిశోధన, రూపకల్పన, అభివృద్ధి, వ్యవస్థాపకత కోసం అవసరమైన పర్యావరణ వ్యవస్థ కూడా వేగంగా తయారవుతోందని ఆయన అన్నారు.

ఆన్‌లైన్ విద్య కోసం కొత్త వనరులను సృష్టించడం, స్మార్ట్ ఇండియా హాకథాన్ వంటి ప్రచారాల వలన భారతదేశ విద్య మరింత ఆధునికంగా మారాలన్న దానికి స్థానిక ప్రతిభకు పూర్తి అవకాశం లభిస్తుందని అన్నారు. దేశంలో  “కొత్త విద్యా విధానం” ఇటీవలే ప్రకటించడం జరిగిందన్న ఆయన 21 వ శతాబ్దపు యువత ఆలోచన, అవసరాలు, ఆశలు, ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకుని ఈ విధానం రూపొందించబడిందని అన్నారు. నూతన విద్యా విధానం కేవలం విధానమే కాదని, 130 కోట్లకు పైగా భారతీయుల ఆకాంక్షల ప్రతిబింబం కూడానని అన్నారు. దేశంలో చాలా జనాభా ఉందన్న ఆయన ఇందులో బాగా చదువుకున్న వారు ఉన్నారని వారు చదివిన వాటిలో చాలా వరకు అది వారికి నిజజీవితంలో పనిచేయదని అన్నారు. డిగ్రీలు చేసి కూడా తనలో సామర్ధ్యం కొరవడడం కారణంగా అసంపూర్ణ విద్యార్ధులుగా మారుతున్నారని అన్నారు. కొత్త విద్యా విధానం ద్వారా ఈ విధానాన్ని మార్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి, మునుపటి లోపాలను తొలగిస్తున్నారని అన్నారు. భారతదేశ విద్యా వ్యవస్థలో క్రమబద్ధమైన సంస్కరణల ద్వారా,  విద్య ముఖ్య ఉద్దేశ్యం, లక్ష్యం, కంటెంట్ రెండింటినీ మార్చే ప్రయత్నం జరుగుతోందని అన్నారు.

ఇప్పుడు విద్యా విధానంలో తీసుకువచ్చిన మార్పుల వల్ల భారతదేశ భాషలు మరింత పురోగమిస్తాయి,మరింతగా అభివృద్ధి చెందుతాయని అన్నారు.  దేశ యువత శక్తిసామర్ధ్యాలను నేను ఎప్పుడూ విశ్వస్తానన్న ఆయన ఈ నమ్మకాన్ని ఈ దేశ యువత మళ్లీ మళ్లీ నిరూపించిందని అన్నారు. ఇటీవల, “కరోనా” నుంచి రక్షణ కోసం  “ఫేస్ షీల్డ్స్” కు డిమాండ్ పెరిగిందని, 3డి ప్రింటింగ్ టెక్నాలజీతో దేశ యువత ఈ డిమాండ్‌ను తీర్చడానికి ముందుకు వచ్చిందని అన్నారు. దేశంలోని పేదలకు మెరుగైన జీవితాన్ని ఇవ్వడానికి, “ఈజీ ఆఫ్ లివింగ్” అనే లక్ష్యాన్ని సాధించడంలో మీ అందరి పాత్ర చాలా ముఖ్యమైనదన్న ఆయన  “స్మార్ట్ ఇండియా హాకథాన్” ద్వారా, గతంలో దేశంలో అద్భుతమైన ఆవిష్కరణలు వచ్చాయని అన్నారు. ఈ హాకథాన్ తరువాత కూడా, దేశ అవసరాలను అర్థం చేసుకుని,  స్వావలంబన దిశగా  కొత్త ఆవిష్కరణలు, పరిష్కారాలపై కృషి చేస్తూనే ఉంటారనే నమ్మకం నాకు యువత పై ఉందని మోడీ అన్నారు.