రైతుల‌కు ప్ర‌ధాని మోడీ గుడ్‌న్యూస్‌

రైతుల‌కు ప్ర‌ధాని మోడీ గుడ్‌న్యూస్‌

రైతుల‌కు అండ‌గా ఉంటున్నారు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.. అప్ప‌టికే తెలంగాణ‌లో ఉన్న రైతు బంధు ప‌థ‌కం త‌ర‌హాలో.. దేశ‌వ్యాప్తంగా.. పీఎం కిసాన్ సమ్మాన్ నిధిని ఏర్పాటు చేశారు.. ఇప్పటి వరకు ఈ పథకంలో 10 కోట్లకు పైగా రైతులు చేరిన‌ట్టు లెక్క‌లు చెబుతున్నాయి.. ఇక‌, పీఎం కిసాన్ స్కీమ్ ద్వారా రైతుకు ఏడాదికి రూ.6,000 అంద‌జేస్తోంది మోడీ స‌ర్కార్.. ఆ మొత్తాన్ని రూ.2,000 చొప్పున మూడు విడతల్లో రైతుల బ్యాంక్ ఖాతాల్లో జ‌మ‌చేస్తూ వ‌స్తున్నారు.. ఇప్ప‌టికే ఐదు విడ‌త‌లుగా రైతుల ఖాతాల్లో డ‌బ్బులు జ‌మ‌కాగా.. త్వ‌ర‌లోనే ఆరో విడత డబ్బులు కూడా రైతుల బ్యాంకు ఖాతాల్లో వేసేందుకు ప్ర‌భుత్వం సిద్ధ‌మ‌వుతోంది.. ఆగ‌స్టు 1వ తేదీ నుంచి అన్నదాతల ఖాతాల్లో డ‌బ్బులు జ‌మ చేయ‌నున్నారు. ఇక అంతే కాదు.. ఈ ప‌థ‌కం అంద‌నివారు కూడా సుల‌భంగా న‌మోదు చేసుకునే వెలుసుబాటు క‌ల్పించింది. పొలం వివరాలు, ఆధార్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ సమాచారం ఉంటే... నేరుగా పీఎం కిసాన్ వెబ్‌సైట్‌లో వివ‌రాలు అప్‌లోడ్ చేస్తే స‌రిపోతుంది అంటున్నారు అధికారులు.