సెంట్ర‌ల్ విస్టాపై మ‌ళ్లీ వివాదం..!

సెంట్ర‌ల్ విస్టాపై మ‌ళ్లీ వివాదం..!

సెంట్రల్‌ విస్టా ప్రాజెక్టులో ప్రధాని కొత్త నివాస భవన నిర్మాణ పనులను కొనసాగించాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులో ఇప్పటికే పలు భవనాలకు పర్యావరణ అనుమతులు దక్కాయి. మిగిలిన వాటికి కూడా పర్యావరణ అనుమతులు ఇచ్చినట్లు సీపీడబ్ల్యూడీ తెలిపింది. మోడీ నివాస భవనాన్ని 2022, డిసెంబరులోగా పూర్తి చేస్తామని నిపుణుల మదింపు కమిటీకి వివరించింది. ఉప రాష్ట్రపతి నివాసం 2022, మేలోగా పూర్తి కానుంది. కాగా, కరోనాతో దేశం అతలాకుతలం అవుతున్న వేళ సెంట్రల్‌ విస్టా ప్రాజెక్టును కొనసాగించాలన్న నిర్ణయంపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇది సరైన నిర్ణయం కాదని సీతారాం ఏచూరి ట్వీట్‌ చేశారు. ఆక్సిజన్‌, వ్యాక్సిన్లను కొనడానికి డబ్బులేదని, మోడీ తన అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ప్రజాధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారని విమర్శించారు.