'నా భర్త నుంచి కాపాడండి..'

'నా భర్త నుంచి కాపాడండి..'

ఏడాదిగా తనను తన భర్త శారీరకంగా హింసిస్తున్నాడని కృష్ణా జిల్లా తేలాప్రోలు సర్పంచ్‌ హరిణికుమారి తీవ్ర ఆరోపణలు చేశారు. తనను ప్రాణాలతో ఉండనిస్తాడనే ఆశ కూడా లేదని అన్నారు. ఈమేరకు ఇవాళ ఫేస్‌బుక్‌ ద్వారా తన గోడును వెళ్లబోసుకున్నారు. శరీరంపై గాయాలున్న ఫొటోలను పోస్ట్‌ చేశారు. తన భర్త, టీడీపీ నేత యతేంద్ర తనను హింసిస్తున్నాడని, గన్నవరం పోలీసులకు ఫిర్యాదు చేసిన ఫలితం లేదని హరిణికుమారి వాపోయారు. మరొకరికి ఇటువంటి దుస్థితి రాకూడదనే ఉద్దేశంతో మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేశానని చెప్పారు.