శిక్షణ శిబిరానికి ముందు ఆటగాళ్లకు రెండుసార్లు కరోనా పరీక్షలు... 

శిక్షణ శిబిరానికి ముందు ఆటగాళ్లకు రెండుసార్లు కరోనా పరీక్షలు... 

నిన్న జరిగిన ఐపీఎల్ పాలకమండలి సమావేశంలో ఐపీఎల్ కు సంబంధించిన అన్ని వివరాలపైనా క్లారిటీ ఇచ్చారు అధికారులు. అందులో తెలిపిన వివరాల ప్రకారం ఐపీఎల్ లో పాల్గొనే ఆటగాళ్లు అందరూ యూఏఈకి ప్రయాణించడం నుండి అక్కడ శిక్షణ వరకు కఠినమైన భద్రతా ప్రోటోకాల్‌లను పాటించాల్సి ఉంటుంది. అయితే తమ శిక్షణను తిరిగి ప్రారంభించడానికి ముందు ఆటగాళ్ళు ఓ పత్రంలో సంతకం చేయవలసి ఉంటుంది, అందులోని రూల్స్ ప్రకారం మహమ్మారి తర్వాత శిక్షణ పునః ప్రారంభంతో తమకు కలిగే నష్టాలను గుర్తించి ఆటగాళ్ళు ఫారమ్‌లో సంతకం చేయాల్సి ఉంటుంది. అలాగే శిక్షణ శిబిరానికి ముందు ఆటగాళ్లకు రెండుసార్లు కరోనా పరీక్షలు నిర్వహిస్తారు. అందులో నెగెటివ్ వచ్చిన వారు మాత్రమే శిక్షణ శిబిరంలో పాల్గొంటారు. ఇక క్రీడాకారులు స్టేడియానికి వెళ్ళే మార్గంలో N95 మాస్క్ ధరించాల్సి ఉంటుంది. అయితే ఐపీఎల్ జట్లు అన్ని ఆగస్టు 26 న యూఏఈ కి బయలుదేరుతాయి.