పల్నాడులో పట్టు నిలుపుకున్న వైసీపీ..పిడుగురాళ్ళ కూడా ఏకగ్రీవం !

పల్నాడులో పట్టు నిలుపుకున్న వైసీపీ..పిడుగురాళ్ళ కూడా ఏకగ్రీవం  !

ఇప్పటికే గుంటూరు జిల్లా మాచర్ల మున్సిపాలిటీ ఏకగ్రీవం అయ్యింది. పంచాయతీ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసిన వైసీపీ.....మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా రిపీట్ చేసింది. 31 ఒక్క వార్డులు ఉన్న మాచర్ల మునిసిపాలిటీలో వైసీపీ అభ్యర్థులు మాత్రమే బరిలో నిలవగా మిగిలిన అందరూ నామినేషన్లు విత్ డ్రా చేసుకున్నారు. మరోవైపు పిడుగురాళ్ల మున్సిపాలిటీ కూడా వైసీపీకే ఏకగ్రీవం అయ్యింది. గుంటూరు జిల్లాలో 7 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతుండగా 5 చోట్ల మాత్రమే పోలింగ్ జరగనుంది. మాచర్ల, పిడుగురాళ్ల ను ఎన్నికలు లేకుండా ఏకగ్రీవంగా వైసీపీ కైవసం చేసుకుంది. మొదట మాచర్ల మున్సిపాలిటీ ఏకగ్రీవం అయ్యింది. 31 వార్డులు ఉన్న ఈ మున్సిపాలిటీలో ఎన్నికలకు ఎవరూ ముందుకు రాలేదు. నామినేషన్ వేసిన వారు సైతం వెనక్కి వెళ్లిపోయారు. దీంతో ఏకంగా అన్ని వార్డులు పోటీ లేకుండా వైసీపీ గెలుచుకుంది. 

ఇకపోతే పిడుగురాళ్ల మున్సిపాలిటీ కూడా వైసీపీ ఏకగ్రీవంగా గెలుచుకుంది. పిడుగురాళ్లలో మొత్తం 33 వార్డులు ఉండగా.......135 నామినేషన్లు పడ్డాయి. అయితే ఈ రోజుకి వైసీపీ నుంచి నామినేషన్ వేసిన 33 మంది మినహా అంతా ఉపసంహరించుకున్నారు. దీంతో పిడుగురాళ్ల మున్సిపాలిటీ కూడా అనూహ్యంగా ఏకగ్రీవం అయ్యింది. కొత్త సుబ్బారావును పార్టీ చైర్మన్ అభ్యర్థిగా సూచించింది. దీంతో ఆయన పిడుగురాళ్ల మున్సిపాలిటీ చైర్మన్ గా ఎన్నిక కాబోతున్నారు. మరోవైపు పిడుగురాళ్ల మున్సిపాలిటీ కూడా వైసీపీకి ఏకగ్రీవం అయ్యింది. జిల్లాలో 7 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతుండగా....5 చోట్ల మాత్రమే పోలింగ్ జరగనుంది. మాచర్ల, పిడుగురాళ్ల ను ఎన్నికలు లేకుండా ఏకగ్రీవంగా వైసీపీ కైవసం చేసుకుంది.