కుప్పం నేతకు కవచంలా మారిన ఫోన్

కుప్పం నేతకు కవచంలా మారిన ఫోన్

 చిత్తూరు జిల్లా కుప్పం సరిహద్దులో కాల్పుల కలకలం రేపుతోంది. డీఎంకే నేత వేలాయుధంపై నాటు తుపాకీలతో కాల్పులు జరిపారు దుండగులు.దీంతో డీఎంకే నేత వేలాయుధంకు తీవ్రంగా గాయపడటంతో ఆస్పత్రికి తరలించి అందిస్తున్నారు. కుప్పం సమీపంలోని తమిళనాడు రాష్ట్రం నారాయణపురంలోఈ ఘటన చోటు చేసుకుంది. కాల్పుల తర్వాత నిందితులు కుప్పం వైపు పరారయ్యారు.  ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు  చేస్తున్నారు పోలీసులు. పాయింట్‌ బ్లాంక్‌ రేంజ్‌లో దొరికిపోయాడు. మరో మాట లేదు. వెంట తెచ్చుకున్న తుపాకితో కాల్పులు జరిపారు. ఐతే గన్ పేలింది. కానీ బుల్లెట్ దిగలేదు. అదేలా అనుకుంటున్నారా..? అతడి చొక్కా చేబులో ఉన్న సెల్‌ఫోన్‌... ప్రాణాలను కాపాడింది. బుల్లెట్లు సెల్‌ఫోన్‌కు తగిలి, శరీరంలోకి దూసుకెళ్లలేవు. దీంతో వేలాయుధం స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.