అప్పుడే పెరిగిన పెట్రో ధరలు..!

అప్పుడే పెరిగిన పెట్రో ధరలు..!

అటు యూనియన్ బడ్జెట్‌లో పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ డ్యూటీ, సెస్ విధించినున్నట్టు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్ తన బడ్జెట్‌ ప్రసంగంలో వెల్లడించారో లేదో అప్పుడే కొన్ని ప్రాంతాల్లో పెట్రో ధరలను పెంచేసి విక్రయాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. కేంద్రం నిర్ణయంతో స్థానిక పన్నులతో కలిపి లీటర్ పెట్రోల్‌పై రూ.2.5 పెరగనుండగా... లీటర్ డీజిల్‌పై రూ.2.3 మేర పెగనుంది. పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకం రూ.1తో పాటు, మౌలిక సదుపాయాల సెస్‌ కింద మరో రూ.1 చొప్పున విధిస్తున్నట్టు ఆర్థిక మంత్రి సీతారామన్‌ తన బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. దీని మూలంగా రూ.28వేల కోట్లు ప్రభుత్వ ఖజానాకు చేరుతాయని తెలిపారు. బడ్జెట్ ప్రతిపాదనలో రాత్రి 12 గంటల నుంచి పెరిగిన పెట్రో ధరలను అమల్లోకి రానున్న నేపథ్యంలో... సామాన్యులు అప్పుడే పెట్రోల్ బంకుల దగ్గరకు పరుగులు పెట్టారు. దీంతో పెట్రోల్ బంక్‌ల దగ్గర క్యూలైన్లు ఓవైపు దర్శనమిస్తుండగా.. మరికొన్ని బంక్‌ల్లో నోస్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. కొన్ని పెట్రోల్ బంక్‌లు అయితే.. ముందడుగు వేసి అప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచేశాయని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.