క‌రోనా కాలంలో దోపిడి..! పెట్రోల్‌పై రూ.8.36... డీజిల్‌పై 8.85..

క‌రోనా కాలంలో దోపిడి..! పెట్రోల్‌పై రూ.8.36... డీజిల్‌పై 8.85..

ఓవైపు.. క‌రోనా వైర‌స్‌ విజృంభ‌న‌తో ప్ర‌జ‌లు ఉపాధి కోల్పోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు... కానీ.. కరోనా కష్టకాలంలోనూ ప్రభుత్వాలు దోపిడీ ఆపడం లేదు. పెట్రోలు, డీజిల్‌ ధరలను అంతకంతకూ పెంచుతూ... సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి. దాదాపు 3 నెలల లాక్‌డౌన్‌తో జనం దగ్గర డబ్బుల్లేవు. ఆంక్షలు తొలగించినా... చాలా వ్యాపారాలు మూతపడ్డాయి. ఫలితంగా అనేక మంది ఉపాధి కోల్పోయారు. ఇలాంటి సమయంలోనూ రోజురోజుకి పెట్రోల్ ధర పెరుగుతోంది.  వరుసగా 16వ రోజు కూడా పెట్రోల ధ‌ర‌ల‌ను వ‌డ్డించాయి చ‌మురు సంస్థ‌లు.. లీటర్ పెట్రోల్‌పై 33పైసలు, డీజిల్‌పై 58 పైసలు పెరిగింది. దీంతో.. 16 రోజుల్లో లీటర్‌ పెట్రోల్‌పై రూ.8.36గు పెర‌గ‌గా... లీట‌ర్ డీజిల్‌పై రూ. 8.85 వ‌డ్డించాయి..