పెట్రోల్, డీజిల్ ధరలకు రెక్కలు

పెట్రోల్, డీజిల్ ధరలకు రెక్కలు

దేశంలో ఇంధన ధరలు పెరుగుతూనే ఉన్నాయి. వరుసగా ఐదో రోజు కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. సోమవారం పెట్రోల్ ధర 1 పైసా, డీజిల్ ధర 13 పైసలు పెరిగింది. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.72.17 వద్ద.. డీజిల్ ధర రూ.67.54 వద్ద కొనసాగుతున్నాయి. ముంబయిలో పెట్రోల్ ధర రూ.77.80లుగా.. డీజిల్ ధర రూ.70.76లుగా ఉన్నాయి. హైద‌రాబాద్‌లో పెట్రోల్ ధర రూ.76.58 వద్ద.. డీజిల్ ధర రూ.73.44 వద్ద కొనసాగుతున్నాయి. అమరావతిలో పెట్రోల్‌ ధర రూ.76.32 వద్ద, డీజిల్‌ ధర రూ.72.76 వద్ద ఉన్నాయి.