పెరిగిన పెట్రోలు, డీజిల్‌ ధరలు

పెరిగిన పెట్రోలు, డీజిల్‌ ధరలు

బుధవారం స్థిరంగా ఉన్న ఇంధన ధరలు గురువారం పెరిగాయి. లీటర్ పెట్రోల్ ధర 15 పైసలు, లీటర్ డీజిల్ ధర 16 పైసలు పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు మిశ్రమంగా ఉన్నాయి. సోమ, మంగళవారాల్లో దేశీయంగా పెట్రోలు ధరలు పెరిగినా.. బుధవారం స్థిరంగా ఉన్నాయి. కానీ ఈ రోజు మళ్లీ పుంజుకున్నాయి.

ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.71.15 వద్ద.. డీజిల్ ధర రూ.66.33 వద్ద కొనసాగుతున్నాయి. ముంబయిలో పెట్రోల్ ధర రూ.76.79 లుగా.. డీజిల్ ధర రూ.69.47 లుగా ఉంది. చెన్నైలో పెట్రోలు ధర రూ. 73.87 వద్ద.. డీజిల్‌ ధర రూ.70. 09 వద్ద ఉన్నాయి. హైద‌రాబాద్‌లో పెట్రోల్ ధర రూ.75.50 వద్ద ఉండగా.. డీజిల్ ధర రూ.72.12 వద్ద కొనసాగుతోంది. అమరావతిలో పెట్రోల్‌ ధర రూ.75.28 వద్ద, డీజిల్‌ ధర రూ.71.49 వద్ద ఉన్నాయి.