లాక్‌డౌన్ ఎఫెక్ట్.. అమాంతం పడిపోయిన పెట్రో అమ్మకాలు..!

లాక్‌డౌన్ ఎఫెక్ట్.. అమాంతం పడిపోయిన పెట్రో అమ్మకాలు..!

కరోనా వైరస్ కేసులు నమోదు కావడం... ఆ తర్వాత కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు... భారత ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించడం జరిగిపోయాయి... దీంతో, నిత్యావసర, ఎమర్జెన్సీ సర్వీసులు మినహా మిగతా వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.  నేపథ్యంలో పెట్రోల్ , డీజిల్ అమ్మకాల డిమాండ్‌ భారీగా పడిపోయాయి.. వాహనాలు రోడ్ల మీదికి రావడం తగ్గిపోవడంతో మార్చి నెలలో పెట్రోల్‌  అమ్మకాలు 17.6 శాతం, డీజిల్‌ అమ్మకాలు 26 శాతం క్షీణించిన  నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఇక, పలు విమానాలు రద్దు కావడంతో విమాన ఇంధన (ఏటీఎఫ్‌) అమ్మకాలు ఏకంగా 31.6 శాతం తగ్గిపోయింది. ఏటీఎఫ్‌ విక్రయాలు 31.6 శాతం క్షీణించగా.. ఎల్‌పీజీ అమ్మకాలు మాత్రం 1.9 శాతం పెరడం విశేషంగా చెప్పుకోవాలి. అయితే, పెట్రోల్‌ అమ్మకాలు పడిపోవడం దాదాపు రెండున్నరేళ్లలో ఇదే తొలిసారి అంటున్నారు అధికారులు.