పెట్రో బాంబ్ రెడీ..? లీటర్‌పై రూ.6 పెంపు తప్పదా!?

పెట్రో బాంబ్ రెడీ..? లీటర్‌పై రూ.6 పెంపు తప్పదా!?

త్వరలోనే సామాన్యుడుపై పెట్రో బాంబ్ పేలేలా ఉంది.. ఎప్పుడైనా పెట్రో ధరలు పెరిగే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు. విషయానికి వస్తే.. సౌదీ అరేబియాలోని అరామ్‌కో చమురు శుద్ధి కేంద్రంపై డ్రోన్ దాడి జరిగిన విషయం తెలిసిందే.. పెట్రోల్ ధరలు పెరగడానికి ఇదే కారణం కానుంది అంటున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆయిల్ రిఫైనరీ అయిన అరామ్‌కోపై తిరుగుబాటుదారులు డ్రోన్ దాడులకు పాల్పడడంతో.. క్రూడ్ ఆయిల్ బావులు దెబ్బతిన్నాయి. దీంతో కంపెనీ తమ ఉత్పత్తిని సగానికి తగ్గించేసింది. డ్రోన్ దాడుల్లో దెబ్బతిన్న క్రూడ్ ఆయిల్ బావులను బాగు చేశాకే ఉత్పత్తిని పెంచుతామని.. అప్పటి వరకు ఈ ఇబ్బంది తప్పదంటోంది అరామ్‌కో.. అయితే.. ఈ ప్రభావం చమరు ధరలపై పడే అవకాశం ఉందంటోంది కోటక్ ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్.. ఈ ప్రభావంతో భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు... రూ.5 నుంచి రూ.6 పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే, క్రూడ్ ఆయిల్ ధరలు ప్రస్తుత స్థితిలోనే ఉంటే పెట్రోలు, డీజిల్ పెరిగే అవకాశం ఉందని హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ పేర్కొంది.