వాహనదారులకు షాక్ : పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

వాహనదారులకు షాక్ : పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

దేశంలో వ‌రుస‌గా పెరుగుతూ వ‌చ్చిన పెట్రో ధ‌ర‌లు సామాన్యుడికి చుక్క‌లు చూపించాయి.. కొన్ని ప్రాంతాల్లో సెంచ‌రీ కూడా దాటేశాయి.. కానీ, ఎప్పుడైతే నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి జరిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నిక‌ల సంఘం విడుద‌ల చేసిందో.. అప్ప‌టి నుంచి ఆగిపోయాయి.. కొన్ని సార్లు త‌గ్గాయి త‌ప్పితే.. పెరిగింది మాత్రం లేదు.. అయితే, తాజాగా వాహనదారులకు పెట్రోల్ ధరలు షాక్ ఇచ్చాయి. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ పై 15 పైసలు, లీటర్ డీజిల్ పై 16 పైసలు పెరిగింది. ఈ పెరుగుదలతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.90.56  చేరగా.. లీటర్ డీజిల్ ధర రూ.80.73 కు చేరింది. ఇక హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.93.99 చేరగా.. డీజిల్ ధర రూ. 88.05 కు చేరింది.