ఐదో రోజు అదే బాదుడు.. భారీగా పెరిగిన పెట్రో ధరలు

ఐదో రోజు అదే బాదుడు.. భారీగా పెరిగిన పెట్రో ధరలు

కరోనా లాక్ డౌన్ తో పెట్రోల్, డీజిల్ వినియోగం పడిపోయింది.. దీంతో ధరలు కుడా తగ్గాయి... ఇక 82 రోజుల విరామం ముగిసిన తరువాత వరుసగా ఐదో రోజుకూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచాయి చమురు సంస్థలు.. ఇవాళ  లీటరుపై 60 పైసల చొప్పున వడ్డించాయి. ఇక ఢిల్లీలో పెట్రోల్ ధర రూ .73.40 నుండి 74 రూపాయలకు  పెరగగా, డీజిల్  71.62 రూపాయల నుండి 72.22 రూపాయలకు పెంచినట్లు రాష్ట్ర చమురు మార్కెటింగ్ సంస్థల ధర నోటిఫికేషన్ తెలిపింది. దేశవ్యాప్తంగా రేట్లు పెరిగాయి. స్థానిక అమ్మకపు పన్ను లేదా వ్యాట్ ని బట్టి  ధరలు మారుతూ ఉంటాయి. ఈ ఐదు రోజుల ధరలు గమనిస్తే పెట్రోల్ ధర లీటరుకు రూ .2.74, డీజిల్ రూ .2.83 పెరిగింది.