17వ రోజూ పెరిగిన పెట్రో ధ‌ర‌లు.. ఇవాళ ఎంతంటే..?

17వ రోజూ పెరిగిన పెట్రో ధ‌ర‌లు.. ఇవాళ ఎంతంటే..?

లాక్‌డౌన్ స‌డ‌లింపులు అమ‌ల్లోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి క్ర‌మంగా పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు పెరుగుతున్నాయి.. వ‌రుస‌గా 17 రోజూ కూడా పెట్రో ధ‌ర‌ల‌ను వ‌డ్డించాయి చ‌మురు సంస్థ‌లు.. ఇవాళ లీటర్ పెట్రోల్ పై 20 పైసలు పెంచ‌గా... లీట‌ర్ డీజిల్ పై 55 పైసలు పెంచేశారు.. దీంతో.. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 82.40కి చేర‌గా.. డీజిల్ ధర రూ.77.01కి పెరిగింది.. ఇక‌, విజ‌య‌వాడ‌లో పెట్రోల్ ధ‌ర రూ.82.75కు పెర‌గ‌గా.. లీట‌ర్ డీజిల్ ధర రూ.77.56కు ఎగసింది. మ‌రోవైపు దేశ‌రాజ‌ధాని ఢిల్లీలో లీట‌ర్ పెట్రోల ధ‌ర రూ. 79.76కు చేరింది.. డీజిల్ ధ‌ర రూ. 79.40కి ఎగ‌బాకింది. ఓవైపు ఉపాధిలేక తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్న స‌మ‌యంలో.. ఇలా పెట్రో ధ‌ర‌ల‌ను పెంచి మ‌రింత ఇబ్బందుల‌కు గురిచేస్తున్నారంటూ ప్ర‌జ‌లు తీవ్రంగా మండిప‌డుతున్నారు.. క‌ష్ట స‌మ‌యంలో ప్ర‌జ‌ల‌కు అండ‌గా ఉండాల్సిన ప్ర‌భుత్వం.. ఇలా ధ‌ర‌ల‌ను పెంచుతూ పోవ‌డం ఎంత‌వ‌ర‌కు స‌మంజ‌సం అని ప్ర‌శ్నిస్తున్నారు.