పెరిగిన పెట్రో ధరలు.. ఎక్కడ ఎంత?

పెరిగిన పెట్రో ధరలు.. ఎక్కడ ఎంత?

2019-20 బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్ తన బడ్జెట్‌ ప్రసంగంలో పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని పెంచారు. పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకం రూ.1తో పాటు, మౌలిక సదుపాయాల సెస్‌ కింద మరో రూ.1 చొప్పున విధిస్తున్నట్టు ఆర్థిక మంత్రి సీతారామన్‌ తన బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. దీని మూలంగా రూ.28వేల కోట్లు ప్రభుత్వ ఖజానాకు చేరనున్నాయి. అయితే, బడ్జెట్‌ ఎఫెక్ట్‌తో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగాయి.. స్థానిక పన్నులతో కలిపి లీటర్ పెట్రోల్‌ రూ.2.50 వరకు... లీటర్ డీజిల్‌పై రూ.2.30 వరకు పెరిగాయి. ఇ

పెరిగిన పెట్రో ధరలు ఇలా ఉన్నాయి. ఢిల్లీలో పెట్రోల్‌పై రూ.2.45 పెరగడంతో లీటర్ పెట్రోల్ ధర రూ. 72.96కు చేరగా.. డీజిల్‌పై రూ. 2.36 పెరగడంతో లీటర్ డీజిల్ ధర రూ.66.69కు పెరిగింది. ఇక హైదరాబాద్‌లో పెట్రోల్ పై రూ.2.60 పెరిగింది.. దీంతో లీటర్ పెట్రోల్ ధర రూ. 77.48కు చేరింది.. అదే విధంగా డీజిల్‌పై రూ.2.56 పెంచడంతో లీటర్ డీజిల్ ధర రూ. 72.62కు పెరిగిపోయింది. మరోవైపు నవ్యాంధ్ర రాజధానిలో పెట్రోల్‌పై రూ.2.51 పెరిగింది.. దీంతో లీటర్ పెట్రలో ధర రూ.77.04కు చేరగా.. రూ.డీజిల్‌పై రూ.2.46 పెరగడంతో లీటర్ డీజిల్ ధర రూ.71.82గా పలుకుతోంది. చెన్నైలో రూ 2.56 పెరిగి లీటర్ పెట్రోల్ ధర రూ.75.76కి అమ్ముతుండగా... రూ.రూ.2.51 పెరగడంతో లీటర్ డీజిల్‌ని రూ.70.48కి విక్రయిస్తున్నారు. కోల్‌కతాలో రూ.2.40 పెరగడంతో లీటర్ పెట్రోల్ ధర రూ.75.15కు చేరగా... రూ.2.36 పెరగడంతో లీటర్ డీజిల్ ధర రూ.68.59కు పెరిగింది. ఇక ఆర్థిక రాజధానిలో ముంబైలో రూ.2.42 పెరిగి లీటర్ పెట్రోల్ ధర రూ.78.57కు చేరుకోగా... రూ.2.50 పెరడంతో లీటర్ డీజిల్ ధర రూ.69.90గా పలుకుతోంది.