మద్యం ఇంట్లో స్టోర్ చేసుకుంటున్నారా? జరా జాగ్రత్త
మందుబాబులకు యూపీ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఇంట్లో పార్టీల పార్టీలు, పండగల పేరుతో పదుల లీటర్ల సంఖ్యలో మద్యం తెచ్చిపెట్టుకుంటారు. అయితే, ఇకపై అలా కుదరదు. ఒక ఇంట్లో 6 లీటర్లకంటే ఎక్కువ మొత్తంలో మద్యం ఉంచుకుంటే తప్పనిసరిగా లైసెన్స్ కట్టాలి. లైసెన్స్ ఫీజ్ కిందా రూ.12 వేలు, సెక్యూరిటీ ఫీజ్ కింద రూ.51 వేలు ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. ఈ కొత్త మద్యం విధానానికి సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే కాకుండా, దానికి సంబంధించిన ఆదేశాలు కూడా జారీ అయ్యినట్టు యూపీ ఎక్సయిజ్ శాఖ ప్రకటించింది. మద్యం విక్రయాల ద్వారా ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో రూ.28,340 కోట్ల ఆదాయం పొందగా, కొత్త పాలసీ ప్రకారం 2021-22 ఆర్ధిక సంవత్సరంలో రూ.34,500 కోట్ల ఆదాయం లక్ష్యంగా పెట్టుకుంది ప్రభుత్వం.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)