పగోజిల్లాలో మళ్ళీ ఏలూరు తరహాలో వింత వ్యాధి ?

పగోజిల్లాలో మళ్ళీ ఏలూరు తరహాలో వింత వ్యాధి ?

పశ్చిమ గోదావరి జిల్లాలో మరో వింతవ్యాధి కలకలం రేపుతోంది. రెండ్రోజుల నుంచి గ్రామాల ప్రజలు... అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. పది మంది అస్వస్థతకు గురయ్యారు.  వీరిలో కొందరికి మూర్ఛ లక్షణాలు ఉన్నట్లు వైద్యులు ధృవీకరించారు. అటు బాధితులు.. ఉన్న వారు ఉన్నట్లే... కింద పడిపోతున్నారని స్థానికులు చెబుతున్నారు. పూళ్ల పడమర యస్సి కాలనీలో బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం భాదితుల సంఖ్యా  14 కు చేరింది. ఉన్నట్టుండి కింద పడిపోతున్నారు బాధితులు. 6 గురికి ఫీట్స్ లక్షణాలు కనిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం అందరి ఆరోగ్యం బాగానే వుందని అంటున్నారు డాక్టర్లు. ఎస్సీ కాలనీలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు వైద్యాధికారులు. అలానే ఆశ వర్కర్లు ఇంటింటికి సర్వే చేస్తున్నారు. ఇక గతేడాది డిసెంబరులోనూ ఇదే జిల్లాలో వింతవ్యాధి కలకలం రేపింది. ఆరు వందల మందికిపైగా ఆస్పత్రి పాలయ్యారు.