కరోనా టైం.. మాస్క్‌లపై సర్వే...

కరోనా టైం.. మాస్క్‌లపై సర్వే...

దేశంలో కరోనా వ్యాప్తి చెందిన తర్వాత.. కేంద్రప్రభుత్వం ప్రతి ఒక్కరికీ మాస్క్‌లు తప్పనిసరి చేసినా.. 44 మంది మాత్రమే మాస్క్‌లు ధరిస్తున్నట్టు తాజా సర్వేలో తేలింది. 'అప్నా మాస్క్‌' పేరిట ఏక్‌ దేశ్‌ స్వచ్ఛంద సంస్థ 18 నగరాల్లో నిర్వహించిన సర్వేలో మాస్క్‌లు ధరిస్తున్నవారు 44 శాతమేనని తేలింది. మాస్క్‌తో శ్వాసకు ఇబ్బంది అని 50 శాతం మంది చెప్పగా, అసౌకర్యమని 44 శాతం మంది అన్నారు. వైరస్‌ నిరోధానికి భౌతిక దూరం పాటిస్తే సరిపోతుందనే భావనలో 45 శాతం మంది ఉన్నారు. ఇలాంటివారిలో 26 ఏళ్ల నుంచి 35 ఏళ్ల మధ్యవారు ఎక్కువని, వీరు కరోనాకు అతీతులమన్న ఆలోచనలో ఉన్నారని సర్వే తెలిపింది. 36-55 ఏళ్ల మధ్య వారు మాత్రం మాస్క్‌ విషయంలో జాగ్రత్తగా ఉంటున్నారని పేర్కొంది. పురుషుల కంటే మహిళలే ఎక్కువ చైతన్యంతో ఉన్నారని సర్వే వివరించింది.