ఇక సామాన్యులకూ కోవిడ్ వ్యాక్సిన్‌.. కేంద్రం కీలక నిర్ణయం

ఇక సామాన్యులకూ కోవిడ్ వ్యాక్సిన్‌.. కేంద్రం కీలక నిర్ణయం

కరోనావైరస్‌కు చెక్ పెట్టేందుకు ఇప్పటికే దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కొనసాగుతోంది.. మొదటగా.. కరోనా ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు వ్యాక్సినేషన్‌కు ప్రాధాన్యత ఇచ్చింది సర్కార్.. ఇక, ఇప్పుడు వ్యాక్సినేషన్‌పై కీలక నిర్ణయం తీసుకుంది కేంద్ర కేబినెట్... మార్చి 1వ తేదీ నుంచి సామాన్యులకు కూడా వ్యాక్సిన్ ఇవ్వనున్నారు.. 60 ఏళ్లు పైబడిన వాళ్లతో పాటు.. వివిధ వ్యాధులతో బాధపడుతోన్న 45 ఏళ్లు దాటిన వాళ్లకు కూడా వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. జనవరి 16వ తేదీన ప్రారంభమైన వ్యాక్సినేషన్.. తొలి విడతలో ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు టీకా ఇచ్చారు.. ముందుగా వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు.. ఇలా వ్యాక్సినేషన్ జరుగుతోంది. నిన్నటి వరకు దేశవ్యాప్తంగా 1.17 కోట్ల మందికి వ్యాక్సిన్ ఇచ్చినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఇక, తాజా నిర్ణయంతో మార్చి 1వ తేదీ నుంచి సామాన్యులకు కూడా వ్యాక్సినేషన్ జరగబోతోంది.