రివ్యూ: పెంగ్విన్ 

రివ్యూ: పెంగ్విన్ 

నటీనటులు:  కీర్తి సురేష్, ఆదిదేవ్, లింగ, అద్వైత్, హరిణి, నిత్య తదితరులు 

సంగీతం:  సంతోష్ నారాయణ్ 

 కెమెరా: కార్తీక్ పళని 

నిర్మాతలు:  కార్తీక్ సుబ్బరాజ్, కార్తికేయన్ సంతానం, సుందరం, జయరాం

దర్శకత్వం:  ఈశ్వర్ కార్తీక్ 

ఇటీవల కాలంలో థ్రిల్లర్ సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి.  తక్కువ బడ్జెట్, ఎక్కువ లాభాలు పొందేందుకు ఇలాంటి సినిమాలు తీస్తుంటారు.  కథ, కథనాలు బలంగా ఉంటె ఇలాంటి థ్రిల్లర్ సినిమాలు అద్భుతంగా ఆకట్టుకుంటాయి.  ఈ కోవలోనే ఇప్పుడు కీర్తి సురేష్ మెయిన్ లీడ్ రోల్ చేసిన పెంగ్విన్ సినిమా వచ్చింది.  కోవిడ్ కారణంగా సినిమా థియేటర్లు మూతపడ్డాయి కాబట్టి, ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ ద్వారా రిలీజ్ చేశారు. మరి ఈ సినిమా ఎలా ఉన్నదో ఇప్పుడు చూద్దాం.  

 కథ: 

భార్యాభర్తలైన కీర్తి, లింగ లకు అద్వైత్ అనే ఒక కొడుకు ఉంటాడు.  కొడుకు అల్లారుముద్దుగా పెంచుకుంటూ ఉంటారు.  అయితే, ఓరోజు మిగతా స్కూల్ పిల్లలతో కలిసి ఆడుకోవడానికి బయటకు వెళ్తాడు.  అలా వెళ్లిన కొడుకు తిరిగి రాకపోవడంతో కంగారుపడుతుంది.  కొడుకు కిడ్నాప్ అయ్యాడని తెలుసుకొని షాక్ తింటుంది.  అద్వైత్ ను వెతకడం ప్రారంభిస్తుంది.  అయితే, అద్వైత్ కనిపించకుండా పోవడానికి  కీర్తి సురేష్ కారణం అని చెప్పి  భర్త లింగ ఆమెనుంచి విడాకులు తీసుకుంటాడు.    అయినప్పటికీ కీర్తి సురేష్ తన కొడుకు గురించిన అన్వేషణను ఆపదు.  అదే సమయంలో  కీర్తికి గంగరాజ్ దగ్గరవుతాడు.  ఆమెను వివాహం చేసుకుంటాడు. కానీ, కీర్తి  నిత్యం కొడుకు అద్వైత్ గురించే ఆలోచిస్తుంటుంది.  కొడుకును వెతుక్కుంటూ అడవిలోకి వెళ్లిన కీర్తికి కొడుకు అద్వైత్ కనిపిస్తాడు.   కొడుకు దొరికాడని సంతోష పడుతుంది.  అయితే ఎవరు కిడ్నాప్ చేశారు? ఎందుకు కిడ్నాప్ చేయాల్సి వచ్చింది అనే సందేహాలు కలుగుతాయి... ఆ తరువాత ఏం జరిగింది అన్నది మిగతా కథ.  

విశ్లేషణ: 

థ్రిల్లర్ సినిమా కావడంతో మొదటి ఫ్రేమ్ లోనే అసలు కథలో ఏం చెప్పబోతున్నాడు అనే విషయాన్ని స్పష్టంగా చెప్పేశాడు.  అక్కడి నుంచి ప్రేక్షకుడిని కథలో లీనమయ్యేలా చేయడంలో దర్శకుడు కొంత సఫలం అయ్యాడు.  విషయాన్ని సూటిగా చెప్తూనే సస్పెన్స్ ను క్రియేట్ అయ్యేలా చేశాడు.  పిల్లలను కిడ్నాప్ చేసిన విధానం, అక్కడి నుంచి కీర్తి సురేష్ వారిని వెతుక్కుంటూ వెళ్లిన విధంగా చాలా థ్రిల్ గా ఉంటుంది.   కొడుకు కోసం అడవిలోకి వెళ్ళినపుడు ఆమెకు తన కొడుకు తాలూకు బట్టలు కనిపిస్తాయి.  అందరూ చనిపోయాడని అనుకుంటారు.  కానీ, కీర్తికి మాత్రం కొడుకు బ్రతికే  ఉన్నాడు అని నమ్ముతుంది.     ఆ నమ్మకంతోనే వెతకడం మొదలుపెడుతుంది.  అడవిలో కొడుకు దొరికిన తరువాత మరికొన్ని అనుమానాలు క్రియేట్ అవుతాయి.  ఎవరు ఎందుకు కిడ్నాప్ చేశారు అనే అనుమానం కలుగుతుంది.  

వాటికి సమాధానం సెకండ్ హాఫ్ లో రివీల్ చేశారు.  కిడ్నాప్ కారణాలు, కిడ్నాప్ చేసిన వ్యక్తికీ సంబంధించిన వివరాలను ఒక్కొక్కటిగా సెకండ్  హాఫ్ లో రివీల్ చేశారు.  అయితే, పిల్లల కిడ్నాప్ కు, కీర్తి సురేష్ కొడుకు అద్వైత్  కిడ్నాప్ కు  సంబంధం ఉండదు.  ఇదే ఇందులో ట్విస్ట్.  అయితే, దీనిని రివీల్ చేసిన విధానం, క్లైమాక్స్ కాస్త చప్పగా ఉండటంతో చివర్లో తేలిపోయింది.  

నటీనటుల పనితీరు: 

మహానటి సినిమాతో ఉత్తమనటి అవార్డు దక్కించుకున్న కీర్తి సురేష్ థ్రిల్లర్ జానర్లో చేసిన మొదటి సినిమా ఇది.   ఇందులో ఆ నటనతో ఆకట్టుకుంది.  కథ మొత్తం ఆమె చుట్టూనే నడుస్తుంది.  మూడు వైవిధ్యభరితమైన పాత్రల్లో కీర్తి   సూపర్బ్ గా నటించింది.   మిగతా నటీనటులు తమ పరిధిమేరకు మెప్పించారు.  

సాంకేతిక వర్గం పనితీరు: 

థ్రిల్లర్ సినిమాలకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ప్రాణం అని చెప్పాలి.  మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణ్ అద్భుతంగా  మ్యూజిక్ అందించాడు.  సినిమాటోగ్రఫీ సినిమాకు ప్లస్ అయ్యింది.  దర్శకుడు ఎంచుకున్న కథ పాతదే అయినప్పటికీ, కథనాల్లో కొత్తదనం కనిపించింది.  క్లైమాక్స్ మినహా మిగతా సినిమా అంతా బాగుందని చెప్పాలి.  

 బలాలు:

 నటీనటులు 

ఫస్ట్ హాఫ్ 

స్క్రీన్ ప్లే 

సాంకేతిక వర్గం 

బలహీనతలు: 

క్లైమాక్స్ 

చివరిగా: క్లైమాక్స్ మినహా అంతా ఒకే...