అక్కడ టీడీపీ ఓడిపోతే..?

అక్కడ టీడీపీ ఓడిపోతే..?

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి వైసీపీ ఎమ్మెల్యే పెద్డిరెడ్డి రామచంద్రారెడ్డి సవాల్ విసిరారు. ప్రత్యేకహోదా కోసం వైసీపీ ఎంపీలు రాజీనామా చేసిన నియోజకవర్గాల్లో జరగబోయే ఉప ఎన్నికల్లో తాము పోటీ చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించడంపై పెద్దిరెడ్డి స్పందిస్తూ.. టీడీపీ అధినేత నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నామని.. ఈ ఉపఎన్నికలను రెఫరెండమ్‌గా తీసుకోవాలని.. వాటిలో కనుక తెలుగుదేశం ఓడిపోతే ముఖ్యమంత్రి తన పదవికి రాజీనామా చేయాలని సవాల్ విసిరారు.. ప్రత్యేకహోదా కోసం నాలుగేళ్లుగా పోరాడుతున్న చరిత్ర వైసీపీది అయితే.. ప్రత్యేకహోదా అంటే వారిని జైళ్లలో పెట్టిన చరిత్ర చంద్రబాబుది అని పెద్దిరెడ్డి అన్నారు. ఈ ఉపఎన్నికల్లో ప్రజలు ప్రత్యేకహోదాపై ఎవరికి చిత్తశుద్ధి ఉందో నిరూపిస్తారని అన్నారు. బీజేపీతో తమకు పొత్తు ప్రసక్తే లేదని.. ప్రత్యేకహోదా అంశంలో మోడీ.. వెంకయ్య నాయుడు ద్రోహం చేశారని.. కేంద్రం ప్రకటించిన ప్యాకేజీకి ఒప్పుకుని చంద్రబాబు మోసం చేశారని పెద్దిరెడ్డి విమర్శించారు.