భార్య బెదిరించిందని భర్త ఆత్మహత్య... చివర్లో ట్విస్ట్... 

భార్య బెదిరించిందని భర్త ఆత్మహత్య... చివర్లో ట్విస్ట్... 

దేశంలో లాక్ డౌన్ కాలంలో కూడా క్రైమ్ రేట్ పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ కారణంగా ప్రజలు ఇంటికే పరిమితం కావాల్సి వచ్చింది.  అందరూ ఇంట్లోనే ఉండిపోవడంతో వివిధ రకాల వివిధ గొడవలు, గృహహింస పెరిగిపోయినట్టు గణాంకాలు చెప్తున్నాయి. ఇక ఇదిలా ఉంటె, భార్య పుట్టింటికి వెళ్లి, తిరిగి కాపురానికి రావడం లేదని మనస్తాపం చెంది ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు.  ఈ సంఘటన పెద్దపల్లి జిల్లా వెల్గటూరులో జరిగింది.  శ్రీధర్ అనే యువకుడికి 2011లో జల అనే యువతితో వివాహం జరిగింది.  వివాహం తరువాత ఆ యువకుడు భార్యను వేధించడం మొదలుపెట్టాడు.  

తరువాత తాగుడుకు బానిసయ్యాడు. భర్త వేధింపులు తట్టుకోలేక యువతి పదిరోజుల కిందట పుట్టింటికి వెళ్ళింది.  అయితే, రెండు రోజుల క్రితం భార్య మరో మహిళను వెంటబెట్టుకొని వచ్చి పెళ్ళయ్యి ఇన్నేళ్లయినా పిల్లలు పుట్టడం లేదని, టెస్ట్ చేయించుకోవడానికి కరీంనగర్ రావాలని, రాకుంటే మాత్రం బాగుందని బెదిరించి వెళ్ళింది.  దీంతో మనస్తాపం చెందిన భర్త ఆత్మహత్య చేసుకున్నాడు.  ఆత్మహత్య చేసుకునే ముందు తన చావుకు కారణం భార్య అని, తన ఆస్తిని తన తల్లికే చెందాలని చెప్పి నోట్ రాసిపెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు.  పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారిస్తున్నారు.