వీసా సమస్యను మరోసారి ఐసీసీ ముందు పెట్టిన పీసీబీ...

వీసా సమస్యను మరోసారి ఐసీసీ ముందు పెట్టిన పీసీబీ...

వచ్చే ఏడాది భారత్ వేదికగా జరగనున్న ఐసీసీ ప్రపంచ కప్ లో పాల్గొనేందుకు పాకిస్థాన్ ఆటగాళ్లకు అలాగే మిగిత సహాయక సిబ్బందికి రావాల్సిన వీసాల పై బీసీసీఐ బాధ్యత వహించాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తెలిపింది. అయితే మొదట ఈ ఏడాది జరగాల్సిన ఆసియా కప్ కు హోస్టింగ్ బాధ్యతలు పీసీబీ దక్కించుకున్న తర్వాత తమ ఆటగాళ్లను పంపించడం కుదరదని మరెక్కడైనా దానిని నిర్వహిస్తేనే మా జట్టును పంపిస్తామని బీసీసీఐ తెలిపింది. అయితే ముందు కుదరదు అని చెప్పిన పీసీబీ తర్వాత ఆసియా కప్ ను శ్రీలంకలో నిర్వహించడానికి సిద్ధమైంది. అయితే వచ్చే ఏడాది జరగనున్న టీ 20 ప్రపంచ కప్ కు బీసీసీఐ ఆతిధ్యం ఇవ్వనుంది. మా దేశంలోకి రావడానికి ఒప్పుకోనివారు మమ్మల్ని తమ దేశంలోకి రాణిస్తారా... అప్పుడు పీసీబీ ప్రశ్నించి... భారత్ కు వీసాలు పొందడంలో తమ జట్టుకు ఎలాంటి సమస్యలు ఎదురుకావని బీసీసీఐ నుండి లిఖితపూర్వక హామీలు ఇప్పించాలని ఐసీసీ ని కోరింది.

ఇక తాజాగా మరోసారి అదే సమస్యను ఐసీసీ ముందు పెట్టింది బీసీసీఐ. ఇది మాములు ద్వైపాక్షిక సిరీస్ కాదు. ఒక ఐసీసీ టోర్నీ. కాబట్టి దానికి ఆతిధ్యం ఇచ్చే బోర్డు అందులో పాల్గొనే ప్రతి జట్టుకు ఎటువంటి సమస్య లేకుండా చూసుకోవాలి అనే నియమం ఉంది. అందువల్ల అందులో పాల్గొనే జట్లలో ఒకటైన మా పాకిస్థాన్ జట్టుకు కూడా వీసా విషయంలో ఎటువంటి సమస్య రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత బీసీసీఐ మీద ఉంటుంది. కాబట్టి మాకు ఆ సమస్య రాదు అని బీసీసీఐ చేత చెప్పించాలని పాక్ బోర్డు ఐసీసీని కోరింది. చూడాలి మరి ఐసీసీ ఈ విషయం పై ఏ విధంగా స్పందిస్తుంది అనేది.