ఆ అమ్మడు దానికే ఫిక్స్ అయితే ఇంక అంతే..

ఆ అమ్మడు దానికే ఫిక్స్ అయితే ఇంక అంతే..

పాయల్ రాజ్ పుత్ ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. చేసిన ఒక్క సినిమాతోనే కుర్ర కారులో తన పేరును ముద్ర వేసింది. ఆర్ఎక్స్-100 సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అయిన ఈ బ్యూటీ తన అందాలతో, నటనతో అందరిని కట్టిపడేసింది. అయితే ఆ తరువాత ఈ అమ్మడుకి అనుకన్ని అవకాశాలు రాలేదు. వెంకీ మామ వంటి క్లాసిక్ సినిమాలో నటించిన పాయల్ బీ గ్రేడ్ సినిమాలకు సంతకం చేసి తప్పుచేసిందని అనుకోవచ్చు. దాని కారణంగా పాయల్ పరిశ్రమలో తన స్థాయిని చాలా తగ్గించుకుంటోందని చర్చకు వచ్చింది. వీటితో పాటుగా మరెన్నో కారణాల వల్ల ఈ బ్యూటీకి అవకావాలు లేవు. దాంతో హిందీ, తెలుగులో కొన్ని వెబ్ సిరీస్‌లకు ఓకే చిప్పింది. వాటిలో ఇటీవల వచ్చిన అనగానగా ఓ అతిథి ఒకటి. ఇది ఓటీటీలో మంచి ఆదరణ పొందుతోంది. దాంతో పాయల్ మరిన్ని వెబ్ సిరీస్‌లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు సిద్దపడుతోంది. అయితే ఈ బొమ్మ పూర్తిగా ఓటీటీ, డిజిటర్ ప్లాట్‌ఫార్మ్‌లకే మారిపోతే ఇకేంముంది. కుర్రకారును ఉర్రూతలూగిస్తుంది. తన బోల్డ యాక్షన్‌తో రెచ్చిపోతుంది. అయితే ఇటీవల వెబ్ డిజిటల్ కంటెంట్‌పై కూడా సెన్సార్ షిప్‌కు కేంద్రం ఓకే చెప్పింది. దాంతో పాయల్ సరైన సమయంలో డిజిటల్‌లో అడుగు పెట్టలేదని అనుకోవచ్చు.