లిప్ లాక్ అంటే అమ్మను పర్మిషన్ అడుగుతా అంటున్న హీరోయిన్... 

లిప్ లాక్ అంటే అమ్మను పర్మిషన్ అడుగుతా అంటున్న హీరోయిన్... 

ఆర్ ఎక్స్ 100 సినిమాతో కుర్రకారుని తనవైపు తిప్పుకున్న బ్యూటీ పాయల్ రాజ్ పుత్ . ఈ సినిమాలో ఆమె చేసిన గ్లామర్ అండ్ బోల్డ్ రోల్ కి యువత బాగా కనెక్ట్ అయ్యారు. ఆ తర్వాత తన ఘాటు అందాలతో కుర్రకారు మతి చెడగొట్టిన ఈ పంజాబీ బ్యూటీ వరుసగా ఆఫర్లు  అందుకుంది. ఇటీవల వెంకటేష్ తో 'వెంకీమామ', రవితేజ  తో డిస్కోరాజా వంటి సినిమాలో నటించింది. కానీ ఆ రెండు సినిమాలు అనుకున్నంతగా ఆడలేదు. అయితే ఈ అమ్మడు ఆర్ ఎక్స్ 100 , ఆ తర్వాత ఆర్డిఎక్స్ లవ్ సినిమాలో బోల్డ్ గా అలాగే లిప్ లాక్ లతో  రెచ్చిపోయింది. ఇక తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఈ సన్నివేశాల గురించి పాయల్ ను ప్రశ్నించగా ఎవరు ఊహించని సమాధానం ఇచ్చింది. '' నేను చేసే ఏ సినిమాలోనైనా సరే లిప్ లాక్ సీన్స్ ఉంటె ముందుగా వెళ్లి మా అమ్మను అడుగుతా... ఆవిడ గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే అందులో నటిస్తా'' అని తెలిపింది. ఇక పాయల్ ప్రస్తుతం అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో  వస్తున్న పుష్ప సినిమాలో ఓ ఐటమ్ సాంగ్ లో కనిపించనున్నట్లు తెలుస్తుంది.