పాయల్ కు కరోనా టెస్ట్ .. చిన్నపిల్లలా ఏడ్చేసింది

పాయల్ కు కరోనా టెస్ట్ .. చిన్నపిల్లలా ఏడ్చేసింది

పాయల్ రాజ్ పుత్ ఆర్ఎక్స్ 100 చిత్రంతో యువతనంతా తనవైపు తిప్పేసుకుంది. తొలి చిత్రంతోనే ఈ పంజాబీ భామ కుర్రకారులో క్రేజ్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం పాయల్ రాజ్ పుత్ కు గ్లామర్ రోల్స్ దక్కుతున్నాయి. రీసెంట్ గా పాయల్ రాజ్ పుత్ వెంకీమామ చిత్రంలో నటించిన మరో సక్సెస్ సొంతం చేసుకుంది. తాజాగా ఈ బ్యూటీ కరోనా టెస్ట్ చేయించుకుంది. టాలీవుడ్ లో సినిమా సందడి మళ్ళీ మొదలైన విషయం తెలిసిందే. తగు జాగ్రత్తలు తీసుకొని హీరో హీరోయిన్లు షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో పాయల్ రాజ్ పుత్ కూడా షూటింగ్ కు సిద్దమవుతుంది. అయితే ఈ అమ్మడు ఇందులో భాగంగా కరోనా టెస్ట్ చేయించుకుంది.  కరోనా పరీక్ష కోసం పాయల్ దగ్గర నుంచి శాంపిల్స్ ను తీసుకున్నారు వైద్య సిబ్బంది ఆ సమయంలో చిన్న పిల్లలా ఏడ్చేసింది పాయల్ .  ఇంజక్షన్ చేయించుకునేటప్పుడు చిన్న పిల్లల్లా గోలచేసింది. దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. యక ఈ వీడియో పై పాయల్ స్పందిస్తూ .. అలా శాంపిల్స్ తీసుకోవడంతో  చాలా బయమేసింది . ముక్కులో తిప్పుతూ శాంపిల్స్ తీసుకోవడం భయంగా, ఇబ్బందిగా అనిపించింది. ఏదేమైనా టెస్ట్ లో నెగిటివ్ వచ్చింది అంటూ చెప్పుకొచ్చింది పాయల్ .