లైంగిక వేధింపుల కేసులో ఆ దర్శకుడికి సమన్లు

లైంగిక వేధింపుల కేసులో ఆ దర్శకుడికి సమన్లు

బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ పై నటి పాయల్ ఘోష్ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ తనను వేధించాడని పాయల్ చెప్పుకొస్తుంది. తనను రూమ్ కి పిలిచి అసభ్యంగా ప్రవర్తించాడని తెలిపింది. నేను ఏ హీరోయిన్ ని పిలిచినా ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తుందని అతడు చెప్పాడని చెప్పింది పాయల్ . అనురాగ్ కశ్యప్ తర్వాత తాను మరే దర్శకుడి నుంచి అలాంటి అనుభవాలను ఎదురుకోలేదని తెలిపింది .వ్యవహారంలో దర్శకుడు అనురాగ్ కశ్యప్ పై నటి పాయల్ ఘోష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐపిసి సెక్షన్ 376 354 341 342 కింద పోలీసులు అతడి పై కేసు నమోదు చేశారు. ఈ కేసుపై త్వరగా దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తూ తనకు న్యాయం జరగకపోతే నిరాహార దీక్ష చేస్తానని కూడా పాయల్  పేర్కొంది.తనకు ప్రాణహాని ఉందని భద్రత కల్పించమని పాయల్ ప్రధాని నరేంద్ర మోదీని కోరింది.ఇదే క్రమంలో నిన్న మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారిని కలిసి ఈ విషయంపై ఫిర్యాదు చేసింది పాయల్. ఈ నేపథ్యంలో అనురాగ్ ని సమన్లు జారీ చేశారు.త్వరలో అనురాగ్ ను పోలీసులు విచారించనున్నారు.