'వకీల్ సాబ్' ఫస్ట్ డే కలెక్షన్స్... బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసిన పవర్ స్టార్

'వకీల్ సాబ్' ఫస్ట్ డే కలెక్షన్స్... బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసిన పవర్ స్టార్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ మూవీ 'వకీల్ సాబ్' విడుదలై రికార్డ్స్ దుమ్ముదులుపుతోంది. ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తోంది. ఈ కోర్ట్ డ్రామాకు విమర్శకులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు కూడా లభించాయి. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై బోనీ కపూర్ సమర్పణలో దిల్ రాజు, శిరీష్ నిర్మించారు, 2016లో వచ్చిన హిందీ చిత్రం 'పింక్' రీమేక్ 'వకీల్ సాబ్'. ఈ చిత్రంలో అంజలి, అనన్య, నివేదా నటనకు మంచి మార్కులు పడ్డాయి. ప్రస్తుతం పవన్ మేనియా కొనసాగుతోంది. అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకుంటున్న ఈ చిత్రం మొదటిరోజే తెలుగు రాష్ట్రాల్లో కలిసి 32 కోట్ల భారీ వసూళ్లు రాబట్టింది. 
 
ఏపీ, తెలంగాణలో ప్రాంతాల వారీగా మొదటి రోజు కలెక్షన్స్ :
నైజాం : రూ .8.75 కో
సీడెడ్ : రూ. 4.0 కోట్లు
యుఎ : రూ. 3.85 కోట్లు 
తూర్పు గోదావరి : రూ .3.1 కోట్లు
పశ్చిమ గోదావరి : రూ .4.5 కోట్లు
గుంటూరు : రూ .3.94 కోట్లు 
కృష్ణ : రూ 1.9 కోట్లు
నెల్లూరు : రూ .1.7 కోట్లు
ఏపీ, తెలంగాణలో 'వకీల్ సాబ్' మొదటి రోజు మొత్తం కలెక్షన్స్ : రూ .32.24 కోట్లు