‘వకీల్‌సాబ్‌' హక్కులు దక్కించుకున్న అమెజాన్‌ ప్రైమ్!

‘వకీల్‌సాబ్‌' హక్కులు దక్కించుకున్న అమెజాన్‌ ప్రైమ్!

పవర్ స్టార్ పవన్‌కల్యాణ్‌ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘వకీల్‌సాబ్‌'. శ్రీరామ్‌ వేణు దర్శకుడు. దిల్‌రాజు, శిరీష్‌ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ 9న విడుదల చేయబోతున్నారు. హిందీలో విజయవంతమైన ‘పింక్‌' చిత్రానికి రీమేక్‌ ఇది. ‘ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఇటీవల విడుదలైన టీజర్‌కు మంచి స్పందన లభిస్తోంది.  శృతిహాసన్‌, నివేదా థామస్‌, అంజలి, అనన్య నాగళ్ల తదితరులు నటిస్తున్నారు. పవన్ మూడేళ్ళ తరువాత తెర మీద కనిపించబోతుండటంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా వకీల్ సాబ్ డిజిటల్ రైట్స్ ను ప్రముఖ సంస్థ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. భారీ రేటుకు ఈ సినిమా హక్కులను కొనుగోలు చేశారని సమాచారం. కాగా నిర్మాత దిల్ రాజు ‘వకీల్ సాబ్’ సినిమా థియేటర్లో విడుదల అయిన 50 రోజుల తరువాతే అమెజాన్ లో ప్రసారం చేయాలని కండీషన్ పెట్టాడట. టీవీ శాటిలైట్ హక్కులను ప్రముఖ జీ స్టూడియోస్‌ వకీల్ సాబ్ శాటిలైట్‌ హక్కులను దక్కించుకుందని సమాచారం.