రైతుల కన్నీళ్లు మన దేశానికి మంచిది కాదు

రైతుల కన్నీళ్లు మన దేశానికి మంచిది కాదు

కృష్ణా జిల్లాలోని పామర్రు నియోజకవర్గంలో ఇవాళ జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ పర్యటించారు. ఈ సందర్భంగా తుఫాన్‌కు నష్టపోయిన పంట పొలాలను పరిశీలించారు పవన్ కళ్యాణ్. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ... తుఫాన్ ప్రభావం రైతులను నట్టేట ముంచిందని.. చేతికంది వచ్చిన పంట చేజారిపోవడం బాధాకరమన్నారు.  మీకు అండగా ఉండలానే మీ దగ్గరకు వచ్చానని.. ప్రకృతి వైపరీత్యాలను రాజకీయం చేయమని తెలిపారు.  ఓట్ల సమయంలోనే వచ్చి వెళ్లే వ్యక్తి ని తాను కానని.. ఇప్పుడు ఎన్నికలు లేవని గుర్తు చేశారు.  ప్రజల బాధలను క్షేత్ర స్థాయిలో తెలుసుకునేందుకే వచ్చానని పేర్కొన్నారు.  కష్టించి పండించిన పంట మొత్తం దెబ్బతిందని..  సొంత భూమి రైతులతో పాటు, కౌలు రైతులకు కూడా న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు.  రైతుల కన్నీళ్లు మన దేశానికి మంచిది కాదని..  రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పూర్తిగా రైతాంగాన్ని ఆదుకోవాలని కోరారు.  కర్షకుల కష్టాలు, కన్నీళ్లను కేంద్రం దృష్టికి తీసుకెళ్తానని భరోసా కల్పించారు.