జనసేనాని తిరుపతి పర్యటన ఖరారు... షాతో భేటీ... 

జనసేనాని తిరుపతి పర్యటన ఖరారు... షాతో భేటీ... 

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికకు సంబంధించిన తేదీ ఖరారు కావడంతో అన్ని పార్టీలు ఉప ఎన్నికపై దృష్టిసారించిన సంగతి తెలిసిందే.  ఇప్పటికే తెలుగుదేశం పార్టీ తమ పార్టీ అభ్యర్థిని ప్రకటించింది.  వైసీపీ, జనసేన-బీజేపీలు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉన్నది.  ఇక ఇదిలా ఉంటె, ఈనెల 4,5 తేదీల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరుపతిలో పర్యటిస్తున్నారు.  ఈనెల 4 వ తేదీ సాయంత్రం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో తిరుపతిలో భేటీ కాబోతున్నారు.  తిరుపతి అభ్యర్థి, తాజా రాజకీయ పరిణామాలపై పవన్ కళ్యాణ్ అమిత్ షాతో చర్చించబోతున్నారు.  అదే విధంగా మార్చి 5 వ తేదీన జనసేన, బీజేపీ నేతలతో పవన్ కళ్యాణ్ సమావేశం కాబోతున్నారు.  ఆ సమావేశంలో తిరుపతి అభ్యర్థి ఎవరు అన్నది ఖరారయ్యే అవకాశం ఉంటుంది.