పంచె కడతానంటున్న పవన్ తనయుడు!

పంచె కడతానంటున్న పవన్ తనయుడు!

ఇటీవల పవన్ కళ్యాణ్‌ మాజీ భార్య రేణు దేశాయ్ తన కొడుకు, కూతురుతో కలిసి తిరుమల వెళ్ళి వేంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని వచ్చింది. ఆ సందర్భంగా దైవ దర్శనార్థం పవన్, రేణుదేశాయ్ తనయుడు అకిర పంచె కట్టుకున్నాడు. అయితే... గుడి నుండి తిరిగి హోటల్ గదికి వచ్చిన తర్వాత అకిరా నందన్ కు ఓ సందేహం వచ్చిందట. ''అమ్మాయిలు విడి రోజులలోనూ చీరలు కట్టుకుంటుంటే, మగవాళ్ళు మాత్రం కేవలం గుడికి వెళ్ళినప్పుడు మాత్రమే పంచె లేదా లుంగీ ఎందుకు కట్టుకోవాలి? సంప్రదాయ దుస్తులను మామూలు రోజుల్లో ఎందుకు వేసుకోకూడదు?'' అని. ఆ మాటకు తెగ ఆనందపడిన రేణుదేశాయ్... 'అది మైండ్ సెట్ కు సంబంధించిందని, సౌకర్యంగా అనిపిస్తే ఎంచక్కా ధోవతి కట్టుకోవచ్చ'ని సలహా ఇచ్చిందట. అప్పటి నుండీ తన కొడుకు జీన్స్, షార్ట్స్ తో పాటు ధోవతీలు కట్టుకుంటున్నాడని రేణు దేశాయ్ తెలిపింది. అంతేకాదు... తిరుమలలో అకిరా నందన్ పంచె కట్టుకున్న ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. అన్నట్టు ఇవాళ అకిరా నందన్ పుట్టిన రోజు కూడా. దాంతో చాలామంది మెగా ఫ్యాన్స్ అకిరా నందన్ కు విషెస్ తెలిపారు. మరోమాట... పవన్ కళ్యాణ్ 'వకీల్ సాబ్'లో ఓ చోట అకిరా నందన్ కూడా కనిపిస్తాడంటూ తెగ ప్రచారం జరుగుతోంది. అందులో నిజమెంతో తెలియాలంటే... ఇంకొన్ని గంటలు వేచి ఉండాలి.... తప్పదు!!