సినిమాలు, రాజకీయాలతో పవన్ బిజీ

సినిమాలు, రాజకీయాలతో పవన్ బిజీ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటు సినిమాలు అటు రాజకీయాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. మంగళవారం ఉదయం క్రిష్‌ సినిమా PSPK27 షూటింగ్ లో పాల్గొన్న పవన్ ఆ తర్వాత ల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతున్న 'అయ్యప్పనుమ్ కోషియమ్' షూటింగ్ లో పార్టిసిపేట్ చేశాడు. ఇలా ఒకే రోజు రెండు షూటింగ్ లు చేయటమే కాదు షూటింగ్ గ్యాప్ లో జనసేన పార్టీ లీడర్స్ తో సమావేశాలు నిర్వహిస్తూ ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న మునిసిపల్ ఎన్నికల గురించి వ్యూహ రచనలు చేస్తూ వచ్చారు. ఇలా సినిమాలు, రాజకీయాలను బ్యాలెన్స్ చేస్తూ ఓ స్ట్రాటజీతో ముందుకు వెళుతున్నారు పవన్. మరి రాబోయే రోజుల్లో ఈ రెండు రంగాల్లో పవన్ ఎలాంటి విజయాలను దక్కించుకుంటారో చూడాలి.