పవన్ రెండు పడవల ప్రయాణంతో అభిమానులకు నిరాశ...

పవన్ రెండు పడవల ప్రయాణంతో అభిమానులకు నిరాశ...

పవన్‌ కళ్యాణ్ ఫ్యాన్స్‌ చాలా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు గానీ, వాళ్ల ఆశలు తీరేలా కనిపించట్లేదట. జనసేనాని స్కెచ్చులతో  అభిమానుల ఆశలు పోస్ట్‌పోన్ అవుతున్నాయి. పొలిటికల్‌ షెడ్యూల్స్, సినిమా షూటింగ్స్‌ క్లాష్ అవుతున్నాయని, రాజకీయాలతో సినిమా షూటింగ్‌లకి బ్రేకులు పడుతున్నాయి అంటున్నారు సినీ జనాలు. పవన్‌ కళ్యాణ్‌ రాజకీయాలు, సినిమాలు రెండిటిని బ్యాలెన్స్‌ చేద్దామని చాలా ట్రై చేస్తున్నాడు. కానీ వర్కవుట్‌ కాట్లేదట. పవన్‌ జనసైనికులకు అందుబాటులో ఉండాలనుకుంటే, సినిమా షూటింగ్స్‌ అడ్డొస్తున్నాయి. పోనీ కంటిన్యూస్‌గా షూటింగ్స్‌ చెయ్యాలనుకుంటే పొలిటికల్‌ ఎఫైర్స్‌ తో సినిమా షెడ్యూల్స్‌ మారిపోతున్నాయి. 'వకీల్‌ సాబ్' షూటింగ్‌ ఫైనల్‌ స్టేజ్‌కి వచ్చేసింది. బ్రేకుల్లేకుండా సెట్స్‌కి వెళ్తే తక్కువ టైమ్‌లోనే ఈ సినిమా కంప్లీట్ అయ్యేది. కానీ ఢిల్లీ టూర్లు, ఉప ఎన్నికల వ్యూహాలతో షూటింగ్‌ షెడ్యూల్స్‌ పోస్ట్‌ పోన్ అవుతున్నాయి. దీంతో పైప్‌లైన్‌లో ఉన్న మిగతా సినిమాలు కూడా వెనక్కి వెళ్తున్నాయి అంటున్నారు ఇండస్ట్రీ జనాలు. పవన్‌ కళ్యాణ్‌ రెండు పడవల ప్రయాణంలో అటు రాజకీయాలకి, ఇటు సినిమాలకి రెండిటికి క్వాలిటీ టైమ్‌ కేటాయించలేకపోతున్నాడట. పవన్‌ రాజకీయాలకి ఎక్కువ టైమ్‌ ఇస్తే ఏడాదికి ఒక్క సినిమా చెయ్యడం కూడా కష్టం. అలాగని సినిమాలు తగ్గిస్తే అభిమానులు డిసప్పాయింట్‌ అవుతారు. మరి సినిమాలు తగ్గకుండా, పాలిటిక్స్‌లో గ్యాప్‌ రాకుండా సిట్యువేషన్స్‌ని పవన్‌ ఎలా హ్యాండిల్‌ చేస్తాడో చూడాలి.