పవన్ సినిమాకు మెగాస్టార్ మూవీ టైటిల్ .?

పవన్ సినిమాకు మెగాస్టార్ మూవీ టైటిల్ .?

మల్టీస్టారర్ సినిమాలు విష‌యంలో టాలీవుడ్ జోరు పెంచిన విష‌యం తెలిసిందే. ‘సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు’ మూవీతో ప్రారంభ‌మైన ఈ ట్రెండ్ ఇప్ప‌టికీ కొన‌సాగుతూనే ఉంది. కాగా తాజాగా తెలుగు ప‌రిశ్ర‌మ‌లో మ‌రో మల్టీస్టారర్ రాబోతున్నట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , రానా కలిసి ఓ సినిమా చేయబోతున్నారని  గత కొద్దిరోజులుగా వార్తలు షికారు చేస్తున్నాయి. మలయాళంలో సూపర్ హిట్ అయిన `అయ్యప్పనమ్ కోషియం` తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాలోని పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో పవన్ కనిపించనున్నాడని ఫిలింనగర్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమాకు 'బిల్లా రంగా' అనే టైటిల్ అనుకుంటున్నారట. ఇదే టైటిల్ తో చాలాకాలం క్రితం మెగాస్టార్ సినిమా వచ్చింది. ఆ సినిమాలో మోహన్ బాబు, చిరంజీవి కలిసి నటించారు. ఇప్పుడు ఇదే టైటిల్ తో పవన్, రానా సినిమా రాబోతుందని అంటున్నారు. అయితే ఈ సినిమాకు ఇంకా రానా నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదట . ఇప్పటికే రానాను దర్శకనిర్మాతలు సంప్రదించారట. సినిమాను వచ్చే ఏడాది రెగ్యులర్ షూట్ ప్రారంభించి.. మే 2021లో విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. సాగర్ చంద్ర ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సితారా ఎంటర్ టైన్మెంట్స్ నిర్మించనుంది.